🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 4:14 pm Posted by : Telangana Gontuka

ఆటోనగర్‌ గణపతి.. సేవకు ప్రతిరూపం!

News Image
వర్ధన్నపేట : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని వివేకానంద కాలనీలో ఆటోనగర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది ప్రత్యేకతను చాటుకున్నాయి. భక్తి, సేవాభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆటోనగర్‌ గణపతి ఉత్సవాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గణపతిని ప్రతిష్ఠించిన రోజు నుంచి నిమజ్జనం వరకు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్వాహకులు భక్తులకు సేవలందించారు. ఆటోనగర్‌లోని వివిధ షాపుల నిర్వాహకులు, యువత సమష్టిగా ముందుకు వచ్చి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు సైతం ఉత్సవాల్లో భాగస్వాములై భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఇక ఈ ఏడాది గణపతి లడ్డూ వేలంపాటలోనూ ప్రత్యేకత చాటుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.1.70,777 లక్షలకు ప్రసన్నకుమార్‌ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. దీంతో ఆటోనగర్‌ గణపతి ఉత్సవాలకు మరింత గుర్తింపు లభించింది. అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం, వ్యాపారుల ఐక్యత, లడ్డూ వేలం ఇలా అన్ని అంశాల్లో ఆటోనగర్‌ గణపతి ఆదర్శంగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.
🏠 Home