🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 4:11 pm Posted by : Telangana Gontuka

సీఈసీని తొలగించాలంటూ సీపీఐ నిరసన

News Image
హన్మకొండ:ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శనివారం బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
🏠 Home