🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 4:10 pm Posted by : Telangana Gontuka

ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన కో-ఆర్డినేటర్ల నియామకం

News Image
వరంగల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ
నియోజకవర్గాల వారీగా కో-ఆర్డినేటర్లను నియమించింది. భూపాలపల్లికి సాగర్‌ ఆర్కే నాయుడు, జనగామకు శ్రీనివాసరావు, పాలకుర్తికి సుధాకర్‌రెడ్డి, డోర్నకల్‌కు హరీశ్‌గౌడ్‌, మహబూబాబాద్‌కు జైసింహను నియమించారు. అలాగే నర్సంపేటకు దామోదర్‌రెడ్డి, పరకాలకు తన్నీరు మధుకర్‌, వరంగల్‌ పశ్చిమకు రాజ్‌కిరణ్‌, వరంగల్‌ తూర్పుకు రాజకుమార్‌, వర్ధన్నపేటకు ప్రేమ్‌గాంధీని కో-ఆర్డినేటర్లుగా నియమించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
🏠 Home