వర్ధన్నపేట: ఇల్లంద గ్రామంలోని గుడివాడలో వీధి లైట్లు వెలగక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యపై గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించారు. వీధి లైట్లకు మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించారు. దీంతో గుడివాడలో రాత్రివేళ వెలుగులు ఏర్పడి స్థానికులకు ఇబ్బందులు తొలగాయి. సమస్యను పరిష్కరించిన పంచాయతీ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.