🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 3:36 pm Posted by : Hanumkonda

తిరుమలలో భక్తుల రద్దీ..!

News Image
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ‘గోవిందా.. గోవిందా’ నామస్మరణతో శ్రీవారి కొండలు మారుమోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్‌ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. 66,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 31,092 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.44 కోట్ల ఆదాయం సమకూరింది. 4.23 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.25 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు.
🏠 Home