🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 3:14 pm Posted by : Telangana Gontuka

జనగణనలో కుల గణన చేపట్టాలి....మంత్రి పొన్నం ప్రభాకర్‌

News Image
సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆమె విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి తదితరులు నివాళులర్పించారు. కులాల వారీగా జనాభా లెక్కలు ఉంటే ఆయా వర్గాలకు అవసరమైన ప్రాతినిధ్యం, వాటాపై శాస్త్రీయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పొన్నం పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని పిలుపునిచ్చారు.
🏠 Home