హైదరాబాద్: భూమి, భుక్తి కోసం నిజాయితీగా పోరాడి సమసమాజ నిర్మాణానికి కృషి చేసిన మహోన్నత మహిళా శక్తి చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. నిమ్స్‌లో డైరెక్టర్ రాహుల్ ధీరజ్ ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం రైతులకు స్ఫూర్తినిచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమాలకు ఆమె ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. Her ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.