పాలకుర్తి: వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజల తెగువకు ప్రతీకగా నిలిచిందన్నారు. మహిళా లోకం ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.