🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 2:41 pm Posted by : Telangana Gontuka

హిమబిందుకు వైద్య విద్యలో బంగారు బాట....ఈగ దామోదర్‌

News Image
వర్ధన్నపేట: పట్టుదలతో చదివి వర్ధన్నపేటకు చెందిన దాసరి హిమబిందు నీట్‌లో 600వ ర్యాంకు సాధించి కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఉచితంగా మెడిసిన్‌ సీటు పొందింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్‌ హిమబిందును, ఆమె తల్లిదండ్రులు భిక్షపతి–రజిత దంపతులను సత్కరించి అభినందించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, హిమబిందు విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో ఉత్తమ వైద్యురాలిగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
🏠 Home