వరంగల్: తాళ్ల పద్మావతి విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్, ప్రముఖ విద్యావేత్త తాళ్ల మల్లేశం (73) మృతి విద్యారంగానికి తీరని లోటని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షుడు ఈగ మల్లేశం అన్నారు. గురువారం గిర్మాజీపేటలోని మల్లేశం స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1981లో 11 మంది విద్యార్థులతో ‘లర్నర్స్ ల్యాండ్’ పాఠశాలను ప్రారంభించి ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు విద్యాసంస్థలను విస్తరించారని కొనియాడారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.