DELHI : డ్రైవింగ్ లైసెన్స్‌కు సెప్టెంబర్ 25లోగా మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ సస్పెండ్ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. డిజిటల్ సేవల కోసం మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలని సూచించింది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే ‘సారథి’ పోర్టల్ ద్వారా ఓటీపీతో మొబైల్ నంబర్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది.