🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 2:08 pm Posted by : Telangana Gontuka

మూడేండ్ల బాలికకు 60 ఏండ్ల వృద్ధుడితో పెండ్లి!

News Image
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మూడేండ్ల బాలికను 60 ఏండ్ల వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక తండ్రి అబ్దుల్‌ బాకీ రూ.25 లక్షల పాకిస్థానీ కరెన్సీ కోసం ఈ వివాహం కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తండ్రిని అరెస్ట్‌ చేయగా.. 60 ఏండ్ల సలాహుద్దీన్‌ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వధువు ధర ‘వాల్వర్‌’ చెల్లించకపోవడంతో వివాహం కాగితాలకే పరిమితమైనట్లు సమాచారం. వష్తన్‌ సమాజంలోని ఈ సంప్రదాయం దుర్వినియోగంపై తాజాగా చర్చ మొదలైంది.
🏠 Home