🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 1:56 pm Posted by : Telangana Gontuka

అనాహత్‌ సింగ్‌ సంచలన విజయం!

News Image
నగోయా: భారత యువ స్క్వాష్‌ క్రీడాకారిణి అనాహత్‌ సింగ్‌ ఏషియన్‌ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన ఆరో సీడ్‌ సటోమి వాటానబేపై 3-2తో విజయం సాధించింది. తొలి రెండు సెట్లు కోల్పోయి 0-2తో వెనుకబడిన అనాహత్‌ అద్భుతంగా పుంజుకుని వరుసగా మూడు సెట్లు గెలిచింది. 9-11, 11-13, 12-10, 11-6, 11-3తో గెలిచి పతకం ఖాయం చేసుకుంది.
🏠 Home