🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 11:23 am Posted by : satla anil kumar

ఇల్లందలో వేలాడుతున్న డిష్ వైర్లు.. యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం

News Image
వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఈ నెల 24న గణపతి నిమజ్జనం అనంతరం ట్రాక్టర్‌పై వస్తున్న ఓ యువకుడి మెడకు విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న డిష్, ఇంటర్నెట్ వైర్లు చుట్టుకున్నాయి. తృటిలో ప్రమాదం తప్పి యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. అస్తవ్యస్తంగా వేలాడుతున్న వైర్లపై గ్రామపంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
🏠 Home