🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 9:20 am Posted by : Telangana Gontuka

గన్నారంలో తీరని దాహం.. 15 రోజులుగా నీటి కష్టాలు

News Image
వరంగల్:రాయపర్తి మండలంలోని గన్నారం గ్రామంలో గత 15 రోజులుగా తీవ్ర తాగునీటి కొరత నెలకొంది. వర్షాకాలంలోనూ నీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యను సర్పంచు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదని శనివారం గ్రామస్థులు తెలిపారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
🏠 Home