*నూతన పీఏసీఎస్ చైర్మన్ అబ్బీడి రాజిరెడ్డికి ఘన సన్మానం*
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అబ్బీడి రాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కుల్ల యాకాంతం, పీఏసీఎస్ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరుపట్ల సాయికుమార్, ఎర్ర శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచులు దుబ్బ అంజయ్య, బత్తిని దశరథం, రజాక్ తదితరులు పాల్గొన్నారు