హైదరాబాద్: మహా నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలను పొడిగించారు. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు వెళ్లే వారికి ఈ నిర్ణయం ఉపయుక్తంగా మారనుంది. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు మెట్రో సేవలు ఉపయోగపడనున్నాయి.