హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మండపం నుంచి కదిలిన మహాగణపతి సుమారు 50 మీటర్ల మేర ముందుకు చేరుకుంది. నిమజ్జనం కోసం ప్రత్యేక వాహనంపై విగ్రహాన్ని తరలిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే దర్శనాలను నిలిపివేసి, షెడ్లు, కర్రల తొలగింపు పనులు పూర్తి చేశారు. ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కగా, సచివాలయం మీదుగా ట్యాంక్‌బండ్ వైపు శోభాయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు నిమజ్జనం పూర్తిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.