భారత పాస్‌పోర్ట్ రంగుల వెనుక అర్థం ఏమిటి?
తెలుపు పాస్‌పోర్ట్ అధికారిక విధుల కోసం విదేశాలకు వెళ్లే ప్రభుత్వ అధికారులు, సంబంధిత ప్రభుత్వ ప్రతినిధులకు జారీ అవుతుంది.
మెరూన్ లేదా డార్క్ రెడ్ పాస్‌పోర్ట్ దౌత్యపరమైన హోదా కలిగిన వ్యక్తులు, నిర్దిష్ట కేటగిరీల్లోని ప్రభుత్వ ఉన్నతాధికారులకు జారీ చేసే డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్.
ఆరెంజ్ రంగు విషయానికి వస్తే.. దీనిపై కొంతకాలంగా సోషల్ మీడియాలో భిన్నమైన సమాచారం ప్రచారంలో ఉంది. వాస్తవానికి పాస్‌పోర్ట్ బుక్లెట్ మొత్తం ఆరెంజ్గా ఉండే ప్రత్యేక సాధారణ పాస్‌పోర్ట్ వర్గం ప్రవేశపెట్టే ప్రతిపాదనపై గతంలో చర్చ జరిగింది. ప్రస్తుతం ECR (Emigration Check Required) హోదా పాస్‌పోర్ట్‌లోని చివరి పేజీల్లో ముద్రిస్తారు.
పాస్‌పోర్ట్ రంగుతోపాటు ECR, ECNR హోదా, పాస్‌పోర్ట్ రకం వంటి వివరాలే ప్రయాణ నిబంధనలను నిర్ణయించడంలో కీలకం. అంతేకాకుండా భారతదేశం బయోమెట్రిక్ చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను కూడా జారీ చేస్తోంది. ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్ కేటగిరీ, ECR స్థితి, ప్రయాణ దేశ నిబంధనలను ముందుగానే పరిశీలించుకోవడం అవసరం.