ములుగు జిల్లా వెంకటాపురం: మండలంలోని సూరవీడు సర్పంచ్ ఇరప మురళి, ఉప సర్పంచ్ మురళిపై సస్పెన్షన్ వేటు పడింది. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంచాయతీ నిధులు దుర్వినియోగమైనట్లు తేలడంతో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో సర్పంచ్, ఉప సర్పంచ్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.