ములుగు జిల్లా తాడ్వాయి–పస్రా మధ్య కొండపర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ నుంచి గుంటూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.