🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 9:18 pm Posted by : Telangana Gontuka

ఆర్టీసీ కార్యాలయంలో సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

News Image
తిరుపతి: ఏపీఎస్‌ఆర్టీసీ కార్యాలయంలో చీఫ్‌ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ సి.ఎస్‌. వర్మ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. డీపీటీవో (DPTO) కార్యాలయంలో తన విధులు నిర్వహించిన చాంబర్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
వర్మ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. కాగా ఓ ఉద్యోగి బదిలీ విషయంలో లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు మూడు నెలల క్రితం వర్మను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
సమాచారం అందుకున్న ఈస్ట్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేశారు. వర్మ ఆత్మహత్యకు గల కారణాలపై ఎస్‌ఐ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
🏠 Home