ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట
అయితే ఆయా బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేసి వినియోగించుకునేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. ఆ మొత్తాన్ని ప్రస్తుతం విడుదల చేయలేమని స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని పేర్కొంటూ రవి ఎనిమిది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన రూ.3 కోట్లను ఉపయోగించుకునేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
అయితే నగదు విడుదలకు న్యాయస్థానం అంగీకరించలేదు. బ్యాంకు ఖాతాలను లావాదేవీల కోసం ఉపయోగించుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రవి బ్యాంకు ఖాతాల వినియోగానికి మార్గం సుగమమైనప్పటికీ, ఖాతాల్లోని రూ.3 కోట్ల నగదుపై మాత్రం ఫ్రీజ్ కొనసాగనుంది.