UGC-NET జూన్ 2026 ఈ-సర్టిఫికెట్లు విడుదల
అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన లాగిన్ వివరాలను నమోదు చేసి ఈ-సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. సర్టిఫికెట్లో పేరు, రోల్ నంబర్, సబ్జెక్ట్, అర్హత కేటగిరీ తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.
UGC-NET అర్హత సాధించిన వారికి నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం, పీహెచ్డీ ప్రవేశం, JRF వంటి అవకాశాలు లభిస్తాయి. ఈ-సర్టిఫికెట్‌ను భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు.
సర్టిఫికెట్ డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైతే లేదా ఇతర ఇబ్బందులు ఉంటే ugcnet@nta.ac.in ఈ-మెయిల్ ద్వారా NTAని సంప్రదించవచ్చు.