హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొత్తగూడెం టూ టౌన్ ఎస్సై కె. వెంకన్న మృతిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వెంకన్న తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు సీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో పోలీస్ శాఖ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.