హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ MCA ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 28 చివరి తేదీ అని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్ లేదా డిగ్రీలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండటంతో పాటు డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.