హైదరాబాద్: మిర్యాలగూడలో 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏ-4గా ఉన్న అబ్దుల్ బారీ మృతి చెందాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బారీ గురువారం ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జైలు సిబ్బంది వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ప్రణయ్ హత్య కేసులో 2025లో న్యాయస్థానం అబ్దుల్ బారీ సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020లో మృతి చెందగా, ఏ-2 సుభాష్ శర్మకు మరణశిక్ష విధించారు.