🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 7:01 pm Posted by : Telangana Gontuka

అధికారిక లాంఛనాలతో ఎస్సై వెంకన్న అంత్యక్రియలు

News Image
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకన్న.. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో పాల్గొంటుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామమైన కిష్టాపురానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న మృతిపట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెంకన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్‌తో పాటు పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు. వెంకన్న మృతితో కిష్టాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
🏠 Home