వర్ధన్నపేట: పట్టణంలోని 10వ వార్డుకు చెందిన గాయల బాబు (65) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి బియ్యం, వంట సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఈగ దామోదర్ గాయల బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో 10వ వార్డు అధ్యక్షుడు కొండేటి బాలకృష్ణ, జిల్లా కోశాధికారి మహమ్మద్ అప్సర్, PACS డైరెక్టర్ కొండేటి మహేందర్, మాజీ కౌన్సిలర్లు సమ్మెట సుధీర్, తుమ్మెల రవీందర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.