నాసిరకం బొగ్గుతో జెన్కోకు రూ.2,900 కోట్ల నష్టం: బీఆర్ఎస్ నేతలు
పవర్ ప్లాంట్లకు నాసిరకం బొగ్గు సరఫరా కావడంతో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని నేతలు ఆరోపించారు. నాసిరకం బొగ్గు కారణంగా జెన్కోకు రూ.2,900 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నుంచి భారీగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023-24లో 70.02 మిలియన్ టన్నుల నుంచి 2025-26లో 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.