‘ది ప్యారడైజ్’.. అంచనాలను అందుకుందా?
కథేంటి?
గుర్తింపు కోసం సవారీ జాతి చేసే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది. సమాజంలో తమకంటూ ఓ స్థానం కోసం వారు ఎదుర్కొనే అవమానాలు, సంఘర్షణలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరపై ఆవిష్కరించారు. ఈ పోరాటంలో నాని పాత్ర కీలకంగా మారుతుంది.
ఎలా ఉందంటే..
కథను విభిన్నంగా చెప్పే ప్రయత్నం, పాత్రల చిత్రణ, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడి మార్క్ టేకింగ్ కనిపిస్తుంది. నాని తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. సాంకేతిక అంశాలు, సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం కొంత నిరాశ కలిగిస్తుంది.
మొత్తంగా భారీ అంచనాలతో వచ్చిన ‘ది ప్యారడైజ్’లో కథ, నటన, టేకింగ్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.