🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 12:37 pm Posted by : Telangana Gontuka

నిమజ్జనంలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

News Image
జగిత్యాల: గణేష్‌ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో బుధవారం రాత్రి విద్యుత్‌ షాక్‌కు గురై గ్రామానికి చెందిన కొప్పుల రాజశేఖర్‌ (23) మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో సౌండ్‌ బాక్సులకు విద్యుత్‌ సరఫరా చేసే మెయిన్‌ వైర్లను కర్రతో సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్‌ మృతి చెందినట్లు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home