హైదరాబాద్: హయత్‌నగర్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కలకలం రేపింది. అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో పేస్ట్ తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్న సుమారు 730 కిలోల పేస్ట్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీంతోపాటు గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పేస్ట్ తయారీలో స్వాధీనం చేసుకున్న ద్రావణం, ఫుడ్ కలర్‌ను ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.