🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 10:41 am Posted by : Telangana Gontuka

రోషిబినా దేవికి రజతం.. భారత్‌కు మరో పతకం!

News Image
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ఐదో రోజు పోటీల్లో భారత వుషూ క్రీడాకారిణి నౌరెమ్‌ రోషిబినా దేవి మహిళల 60 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. రోయింగ్‌లో సత్నామ్‌ సింగ్‌, సల్మాన్‌ ఖాన్‌ జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ఇప్పటివరకు భారత్‌ ఒక స్వర్ణం, 5 రజతాలు, 7 కాంస్యాలతో మొత్తం 13 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్‌ 13వ స్థానంలో కొనసాగుతుండగా, చైనా అగ్రస్థానంలో ఉంది.
🏠 Home