🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 10:33 am Posted by : Telangana Gontuka

చార్మినార్‌ నుంచి ఊడిపడిన పెచ్చులు!

News Image
హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందిన చార్మినార్‌ వద్ద పెచ్చులు ఊడిపడటంతో ఆందోళన నెలకొంది. మొదటి అంతస్తులో మరమ్మతులు జరుగుతున్న ప్రాంతం నుంచి అలంకరణలో భాగమైన పువ్వుల ఆకృతులు ఊడిపడి కిందపడ్డాయి. రాత్రి సమయం కావడంతో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలోనూ మక్కా మసీదు వైపు, భాగ్యలక్ష్మి ఆలయం వైపు పెచ్చులు ఊడిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో చార్మినార్‌ నిర్వహణపై పురావస్తు శాఖ తీరుపై పర్యాటకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🏠 Home