🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 10:25 am Posted by : Telangana Gontuka

బందోబస్తుకు వచ్చి.. విగతజీవిగా మారి

News Image
హైదరాబాద్: గణేశ్ నిమజ్జన బందోబస్తు కోసం హైదరాబాద్‌కు వచ్చిన కొత్తగూడెం టూటౌన్ ఎస్సై కె. వెంకన్న (57) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం నివాసి అయిన వెంకన్నకు ఎన్టీఆర్ గార్డెన్ పుష్‌ఓవర్ బ్రిడ్జి వద్ద విధులు కేటాయించారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సచివాలయం వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వెళ్తున్న గుర్తుతెలియని ద్విచక్ర వాహనం వెంకన్నను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో తలకు, కుడి మోకాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అనంతరం స్వగ్రామానికి వెళ్లిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తలలో రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ బుధవారం వెంకన్న మృతిచెందారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ద్విచక్ర వాహనదారుడి కోసం గాలిస్తున్నారు.
🏠 Home