వరంగల్: జిల్లాలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో నేడు సెప్టెంబర్ 24న అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు అమలు చేయాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.