హనుమకొండ: జిల్లాలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 24, గురువారం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు అమలు చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 24 సెలవుకు బదులుగా అక్టోబర్ 10, రెండో శనివారాన్ని పనిదినంగా నిర్వహించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.