🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 23 September 2026, 9:00 pm Posted by : Telangana Gontuka

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్య శారద

News Image
వరంగల్ జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, నాలాలు, కాలువల సమీపంలోకి వెళ్లకూడదని తెలిపారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున వాగులు, కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితులు లేదా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కోరారు. కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్: 18004253424, 9154252936. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
🏠 Home