🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 23 September 2026, 6:45 pm Posted by : Telangana Gontuka

వినయ్‌ భాస్కర్‌ను పరామర్శించిన ఎర్రబెల్లి

News Image
హనుమకొండ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం సాయంత్రం హనుమకొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు వినయ్‌ భాస్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
🏠 Home