వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వన్నాల వెంకటరమణ డప్పులను అందజేశారు. తన తల్లి వన్నాల జయఅక్క జ్ఞాపకార్థంగా యువతకు ఉపయోగపడేలా డప్పులు అందించినట్లు తెలిపారు. గ్రామీణ కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించడంతో పాటు యువత సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వెంకటరమణ సూచించారు. డప్పులు అందించినందుకు అంబేద్కర్ యూత్ సభ్యులు ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.