వర్ధన్నపేట: వినాయక నిమజ్జనం సందర్భంగా కొనారెడ్డి చెరువు వద్ద విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది, స్విమర్లకు మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి టీ-షర్ట్లు పంపిణీ చేశారు. నిమజ్జనం సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు సౌకర్యాల కల్పనలో సిబ్బంది అందిస్తున్న సేవలను చైర్మన్ అభినందించారు. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ కమ్మం కృష్ణ, నేతావత్ రాజేందర్, తిరుపెల్లి కుమారస్వామి, అనిమిరెడ్డి రాంచంద్రరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.