🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 23 September 2026, 5:52 pm Posted by : Telangana Gontuka

ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌

News Image
అమరావతి/హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇవాళ అర్థరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న రాత్రి 11.30 గంటలకు విశాఖకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. పోర్టుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
🏠 Home