వర్ధన్నపేట: సంగెపు వాగు వద్ద ఉన్న ప్రభుత్వ పోస్టుమార్టం గదిని నూతన ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్ శాఖ చేపడుతున్న విద్యుత్ సరఫరా పనులను పరిశీలించారు. ఇప్పటికే ఫ్రీజర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. మరో రెండు రోజుల్లో నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, కమిషనర్ కృష్ణ సహకారంతో పోస్టుమార్టం గది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.