🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 23 September 2026, 7:44 am Posted by : Telangana Gontuka

రైతులకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

News Image
వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా నియమితులైన అబ్బిడి రాజిరెడ్డి, నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఏసీఎస్‌లు రైతులకు అందుబాటులో ఉండేలా పనిచేస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రైతుల అవసరాలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహకార సేవలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలన్నారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సంఘం అభివృద్ధికి చైర్మన్‌, సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు రాజిరెడ్డి, సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home