వర్ధన్నపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా!
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరిన్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవల పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
ఘటనపై మానవ హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధ్యత వహిస్తూ డాక్టర్ వీరిన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో డాక్టర్ భరత్‌ను ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా నియమించినట్లు సమాచారం.